Sarkaru Vaari Paata Dialogues: ‘సర్కారు వారి పాట’ నుండీ ఆకట్టుకుంటున్న 10 డైలాగులు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద పెద్ద డైలాగులు ఏమీ చెప్పడు. ఒకవేళ చెప్పినా అవి అతని బాడీ లాంగ్వేజ్ కు సెట్ అవ్వవు. ఏదో బలవంతంగా చెప్పించినట్టు అవుతుంది అని అంతా అంటుంటారు. ‘ఖలేజా’ సినిమాతో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యిందని కూడా అంతా చెబుతుంటారు. మహేష్ ప్లస్ పాయింట్ వన్ లైనర్స్.ఇది చాలా సినిమాలతో ప్రూవ్ అయ్యింది. ‘అతడు’ ‘పోకిరి’ ‘దూకుడు’ వంటి సినిమాల్లో డైలాగులు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి అంటే దానికి కారణం అదే. మహేష్ చెప్పే వన్ లైనర్స్ జనాల్లోకి ముఖ్యంగా యూత్లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. తాజాగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్లో కూడా హైలెట్ అయిన డైలాగులు అన్నీ వన్ లైనర్సే అన్న విషయాన్ని మనం గమనించవచ్చు..!

దర్శకుడు పరశురామ్ గతంలో రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆకట్టుకునే డైలాగులు ముఖ్యంగా జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్లే డైలాగులు రాయడంలో అతను సిద్ధహస్తుడు. స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కు శిష్యుడు కావడంతో అతనికి ఇంకా మైలేజ్ అందినట్టు అయ్యింది. ఇలాంటి టాప్ రైటర్ మహేష్ కు డైరెక్టర్ గా దొరికితే డైలాగులు మాములుగా పేలుతాయా? ‘ఇఫ్ ఎ టైగర్ డేట్స్ ఎ రాబిట్.. హౌ ఇట్ విల్ బి.., సేమ్ ఇఫ్ యు మిస్ ది ఇంట్రెస్ట్.. యువర్ డేట్ విల్ కమ్’ అనే డైలాగ్ ను టీజర్లోనే ప్రెజెంట్ చేశాడు పరశురామ్.ఇందులో డబుల్ మీనింగ్ ఉంటుంది అలాగే చాలా మాస్ అప్పీల్ ఉంటుంది. కానీ అది క్లాస్ గా సాగడం.. ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉండడంతో జనాల్లోకి తొందరగా వెళ్ళలేదు.. అందుకే ట్రైలర్లో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా మాస్ డైలాగులు అందించాడు.

ఫ్యాన్స్ కు మాత్రమే కాదు అందరికీ ఈ డైలాగులతో గూజ్ బంప్స్ తెప్పించే ప్రయత్నం చేశాడు. దాన్ని జస్ట్ సాంపుల్ అనే విధంగా ట్రైలర్ తో ప్రజెంట్ చేశాడు. దీంతో అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు సరిగ్గా గమనించినట్లు అయితే 10 సూపర్ హిట్ డైలాగ్స్ ఇందులో ఉంటాయి. ఇవి యూత్ కే కాదు మాస్ ఆడియన్స్ కు మరింతగా కనెక్ట్ అయ్యి సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయని చెప్పాలి. ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ ను మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులు చూస్తున్నారు అంటే అది డైలాగ్స్ వలన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి ‘సర్కారు వారి పాట’ డైలాగ్స్ ను గమనిస్తే:

1) యు కెన్ స్టీల్ మై లవ్.. నా ప్రేమని దొంగిలించగలవ్
యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్ షిప్… నా స్నేహాన్నీ దొంగిలించగలవ్
యు కాంట్ స్టీల్ మై మనీ.. !

2) అమ్మాయిల్ని అప్పించేవాళ్ళని… పాంపర్ చేయ్యాలి రా..
రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు… ఆ నెక్స్ట్..!

3) నేను విన్నాను… నేను ఉన్నాను

 

4) ఈ అమ్మాయి విషయంలో మీరేంటి సార్… ఇంతలా దిగజారిపోయారు..!

 

5) ఏమ‌య్యా కిశోర్‌… మ‌న‌కేమైనా మారేజ్ చేసుకునే వ‌య‌సు వ‌చ్చేసిందంటావా..?
ఊరుకోండి సార్‌.. మీకేంటి అప్పుడే.. చిన్న పిల్లాడైతే..

 

అంద‌రూ నీలాగే అంటున్నార‌య్యా… దీనెమ్మా మెయింటైన్ చేయ‌లేక దూల తీరిపోతోంది..!

 

6) థిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపల గూడ బీచ్ సర్

 

7) ఏటి సేసేస్తావు.. ఆ ఏటో సేసేస్తాడట..!

 

8) అప్పనేది ఆడపిల్ల లాంటిది సర్.. ఇక్కడ ఎవ్వడూ బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు.

9) నా దృష్టిలో అప్ప‌నేది సెట‌ప్ లాంటిది..!(విలన్)

10) ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.

11) ఇట్స్ ఎ బాయి థింగ్..!

ఇవండీ.. ట్రైలర్లోనే ఇన్ని హిట్ డైలాగులు ఉన్నాయంటే.. ఇక సినిమాలో ఏ రేంజ్ డైలాగులు ఉంటాయో.. వాటికి ఏ రేంజ్లో విజిల్స్ పడతాయో… మనం అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus