Sarkaru Vaari Paata Collections: ఫస్ట్ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది..కానీ..!

  • May 16, 2022 / 11:40 AM IST

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వీకెండ్ ను ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.కాకపోతే నైజాంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం లేదు.

వీక్ డేస్ లో ఈ మూవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీకెండ్(4 డేస్) కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 27.92 cr
సీడెడ్   9.38 cr
ఉత్తరాంధ్ర   9.23 cr
ఈస్ట్   6.51 cr
వెస్ట్   4.15 cr
గుంటూరు   7.57 cr
కృష్ణా   4.94 cr
నెల్లూరు   2.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 72.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   4.80 cr
ఓవర్సీస్  10.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 87.55 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.87.55 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. ఆదివారం అడ్వాంటేజ్ తో శ్రీమంతుడు కలెక్షన్లను అధిగమించింది.అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.33.45 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. వీకెండ్ ఓకె…

వీక్ డేస్ లో కూడా స్టడీ గా రాణించాలి. అన్నిటికీ మించి నైజాం లో టికెట్ రెట్లు తగ్గించాలి. అలా అయితేనే వీక్ డేస్ లో కూడా రాణించే అవకాశం ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus