దర్శకుడు పరశురామ్ రూపొందించిన ‘గీత గోవిందం సినిమా కథను ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని బన్నీ చెప్పారట. ఆ సమయంలోనే ‘సర్కారు వారి పాట’ కథ రాసుకున్నారు పరశురామ్. ఈ స్టోరీని కూడా బన్నీకి వినిపించాడని.. ఒక దశలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ హీరోగా ఈ సినిమా చేయడానికి ప్రయత్నించాడని అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ కథనాలపై దర్శకుడు స్పందించాడు. ‘సర్కారు వారి పాట’ కథను బన్నీకి చెప్పలేదని అంటున్నారు. మహేష్ కోసం ఈ కథ పుట్టిందని.. అతడిని దృష్టిలో పెట్టుకొనే కథ రాసినట్లు తెలిపారు. మహేష్ కి కూడా కథ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయిందని అన్నారు. అలానే ఈ సినిమాకి సంబంధించిన మరో రూమర్ పై ఆయన రియాక్ట్ అయ్యారు.
ఈ సినిమాకి ముందుగా సంగీత దర్శకుడు గోపి సుందర్ ను తీసుకోవాలనుకున్నారు. పరశురామ్, గోపిసుందర్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘గీత గోవిందం’ సినిమాకు గోపిసుందర్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను ‘సర్కారు వారి పాట’ కోసం పక్కన పెట్టినట్లు పుకార్లు వినిపించాయి.
దీనిపై స్పందించిన పరశురామ్.. ‘పక్కన పెట్టడం కాదు. ‘సర్కారు వారి పాట’కి వర్క్ చేయాలనుకున్నప్పుడు గోపీసుందర్ చాలా బిజీగా వున్నారు. దాదాపు 8 ప్రాజెక్టులు అతని చేతిలో వున్నాయి. సమయం కుదరక చేయలేదు కానీ పక్కన పెట్టడం మాత్రం కాదు. నా మనసులో గోపీసుందర్ కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.