ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్ అండ్ టీమ్!

మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా పేరు టైప్ చేయగానే మహేష్ స్టిల్ లో ఓ ఎమోజీ వస్తోంది. నిజానికి ఇది కొత్తగా వచ్చిన ప్రమోషన్ కాదు. గతంలో రజినీకాంత్ సినిమాతో ట్విట్టర్ లో ఈ ఎమోజీ ప్రమోషన్ మొదలైంది. ఇటీవల విజయ్ ‘బీస్ట్’ సినిమాకి అలానే ‘కేజీఎఫ్2’ సినిమాలకు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది.

ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకి కూడా ఈ ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు అండ్ టీమ్ ఈ ట్విట్టర్ ఎమోజీని క్రియేట్ చేసింది. ట్విట్టర్ లో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడానికి ఈ ఎమోజీ బాగా ఉపయోగపడుతుంది. తమిళ, కన్నడ సినిమాలు ఈ ట్విట్టర్ ఎమోజీని బాగా వాడుకుంటున్నాయి. అందుకే మహేష్ బాబు టీమ్ దీన్ని సాధించి ట్విట్టర్ లో ఉదయం నుంచి వివిధ ట్యాగ్ ఎమోజీలతో హంగామా మొదలుపెట్టారు.

మహేష్ బాబు ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ ట్యాగ్ ను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మరింత యాక్టివ్ అయ్యారు. మహేష్ బాబు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గోనున్నారు. మే 7న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత మహేష్ బాబు నుంచి వస్తోన్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus