ఈ మధ్య కాలంలో పెద్ద హీరో సినిమా అయితే చాలు మాకు టికెట్ రేట్ల హైక్ కావాలి అంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ లు పెట్టేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్లకి ఫేవర్ గా ఉన్న వాళ్ళకి వెంటనే ఓకె చెప్పేసి జీవోలు రిలీజ్ చేసేస్తున్నాయి. అయితే టికెట్ రేట్లు భారీగా పెంచేయడం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రిపీట్ ఆడియెన్స్ సంగతి చెప్పనవసరం లేదు. టికెట్ రేట్లు మధ్య తరగతి ప్రేక్షకులకి కూడా ఉంటేనే థియేటర్లు కళకళలాడతాయి.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా నిర్మాతలే ఈ విషయాన్ని గ్రహించి వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గించాయి. అయితే ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు తగ్గలేదు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విషయంలో కూడా నిర్మాతలు తగ్గకపోతే చాలా కష్టం. సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి సమ్మర్ కు నడిచే సినిమానే. కానీ టికెట్ రేట్లు అలాగే ఉంటే వీకెండ్ తర్వాత జనాలు థియేటర్లలో కనబడరు. ఈ విషయమై ఆ చిత్రం నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారట.
అలా చేయకపోతే.. వారానికి ఓటిటిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి చూసుకుంటూ కాలక్షేపం చేసేస్తారు. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’ ఓటిటిలో రిలీజ్ అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. మహేష్ బాబు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ విషయం పై తెగ చర్చించుకుంటున్నారు. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ మిస్ అయితే గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్లే..!
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!