అల్లు అర్జున్ తాజా చిత్రం “సరైనోడు” సోమ మరియు మంగళవారం సైతం హౌస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడుతూ.. ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో విజయ విహారం చేస్తుండగా.. ఓవర్సీస్ లో మాత్రం “సరైనోడు” స్క్రీన్ లు ఖాళీగా వెలవెలబోతున్నాయట.
నాలుగు రోజుల్లో 50 కోట్ల రూపాయలు కొల్లగొట్టి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సరైనోడు” ఓవర్సీస్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన మొత్తం కూడా వెనక్కి తెచ్చిపెట్టడం గగనమని తెలుస్తోంది. ఊర మాస్ సినిమా కావడం, ఓవర్సీస్ ఆడియన్స్ కేవలం కుటుంబ కథా చిత్రాలను మాత్రమే ఆదరించడం ఈ పరిణామానికి కారణం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు!