‘సరైనోడు’ మూడు రోజుల కలెక్షన్స్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే రాబట్టింది. తొలిరోజు రూ.10.97 కోట్లు కొల్లగొట్టి బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.5.28 కోట్ల షేర్స్ రాబట్టి ఫర్వాలేదనిపించింది. ఇక మూడోరోజైన ఆదివారం నాడు కలెక్షన్లలో కాస్త జోరు కనిపించింది. మూడోరోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.5.37 కోట్లు వసూళ్ళు రాబట్టింది. దీంతో.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి వీకెండ్‌లో ఈ మూవీ రూ.21.62 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది.

ఏరియాల వారీగా ‘సరైనోడు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్…
నైజాం : 7.10 కోట్లు
సీడెడ్ : 4.35 కోట్లు
వైజాగ్ : 2.21 కోట్లు
గుంటూరు : 2.18 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.81 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.68 కోట్లు
నెల్లూరు : 0.91 కోట్లు
కృష్ణా : 1.38 కోట్లు
ఓవరాల్‌గా ఏపీ+తెలంగాణ షేర్స్ : రూ. 21.62 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus