టాలీవుడ్ టాప్-5గా ‘సరైనోడు’!!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డాషింగ్ డైరెక్టర్ బోయపాటి కలసి చేసిన మాస్ మసాలా సరైనోడు. అయితే ఈ సినిమాకు మొదట కాస్త మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ ఆ టాక్ సినిమాను మాత్రం ఏమీ చెయ్యలేకపోయింది. ఇక ఈ సినిమా బన్నీ కరియర్ లోనే భారీ హిట్ గా నిలిచి కలెక్షన్స్ పరంగా ప్రభంజనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే ఈ హ్యాపినెస్ తో బన్నీ తన తరువాత ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఖుషీగా ఉన్నాడు. త్వరలోనే ద్విభాషా చిత్రాన్ని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే సరైనోడు సూపర్ హిట్ లో ఉన్న బన్నీ బాహుబలి కలెక్షన్స్ పై కామెంట్స్ చేశాడు. బాహుబలి దాదాపుగా 200కోట్లకుపైగా వసూళ్లు సాధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అని, అందులో మొదటిది ఈ సినిమా మన తెలుగు బాషలోనే కాకుండా అటు తెలుగు, ఇటు తమిళం, హింది బాషల్లో  కూడా విడుదల అయ్యింది అని బన్నీ తెలిపాడు. అదే క్రమంలో ఒక బాష కన్నా ఎక్కువ బాషల్లో సినిమా విడుదల చేస్తే భారీ హిట్ ఖాయం ఖాయం అవడమే కాకుండా, సినిమాకు అదిరిపోయే వసూళ్లు కూడా వస్తాయి అని బన్నీ తెలుపుతూ, ఈ విషయంపై మనవాళ్ళు కాస్త వెనుకబడి ఉన్నారని అందుకే అంత సాహసం ఇప్పటివరకూ ఎవ్వరూ చెయ్యలేదు అంటూ తెలిపాడు బన్నీ. అదే క్రమంలో సరైనోడు విషయంలో చాలా సంతోషంగా ఉంది, టాప్5 సినిమాల్లో ఒకటిగా సరైనోడు నిలవడం నిజంగా సంతోషించాల్సిన విషయం అనే తెలిపాడు. ఇక రానున్న రోజుల్లో బన్నీ తన మార్కెట్ ను విస్తరించుకునేందుకు ఇతర బాషల ప్రొడ్యూసర్స్ మరియు, దర్శకులతో సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus