సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖర్చు రూ.కోటి.. !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో ను శుక్రవారం సోషల్ మీడియా ద్వారా నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇలా చేయడం కరెక్టే అంటున్నారు బోయపాటి. ‘ గ్రాండ్ గా ఆడియో ను లాంచ్ చేసి, హంగామా సృష్టించే కంటే కాస్త భిన్నం ఆలోచించాము. ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఆడియో ను విడుదల చేసాం. ఆడియో బాగుందని ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణ లబిస్తోంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. బన్నీ అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతోనే ఏప్రిల్ 10 న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నామ’ని బోయపాటి తెలిపారు. కాగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ రోడ్ లో నిర్వహిస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అక్షరాల రూ.కోటి లను చిత్ర బృందం ఖర్చు చేస్తోంది. ఈ  కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి బన్నీ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus