సుమారు 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత సిద్దార్థ్ ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ మార్కెట్ కూడా కలిసొస్తుంది అనే ఆలోచనతో దాదాపు రూ.8 కోట్ల పారితోషికం ఇచ్చి తీసుకొచ్చారు. సిద్దార్థ్ రీ ఎంట్రీ వేస్ట్ అవ్వలేదు. ఈ సినిమా వల్ల అతనికి హీరోయిన్ అదితి రావు హైదరి దగ్గరయ్యింది. వీరిద్దరూ జంటగా నటించడంతో తెర వెనుక కూడా కెమిస్ట్రీ పండిస్తున్నారు. షూటింగ్ అప్పుడు పరచయం కావడం, తర్వాత అది ప్రేమగా మారడం..
ఇప్పుడు సహజీవనం చేసే వరకు వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని వీరు కోలీవుడ్ మీడియా ఎదుట ఓపెన్ గానే బయటపెట్టారని సమాచారం. వీళ్ళకు పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం ఇప్పట్లో లేదట. అసలు లేదన్నట్టే చెబుతున్నారు. ఇద్దరికీ కూడా గతంలో వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది. తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అందుకే వీరికి సహజీవనమే బాగుందనిపిస్తుందట. ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి సిద్దు – అదితి జంటగా వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అప్పటినుండి వీరి రిలేషన్ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక సిద్దార్థ్‌కి లవ్ స్టోరీలు, సహ జీవనాల ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. గతంలో భార్యకు విడాకులిచ్చిన తర్వాత బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్‌తో, తర్వాత శృతి హాసన్, సమంత లాంటి కథానాయికలతోనూ కొద్ది కాలం రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. తాజాగా అదితి మాజీ భర్త సత్యదీప్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను రెండో వివాహం చేసుకున్నారాయన. ఆమెకు కూడా ఇది సెకండ్ మ్యారేజ్ కావడం విశేషం. రెండో పెళ్లి గురించి, మాజీ భార్య గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని జనవరి 27 ఉదయం రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.. తర్వాత చిన్న పార్టీ ఏర్పాటు చేశాం.. మా బంధం గురించి దాచుకోవాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. రహస్యాలు అనేవి బంధాన్ని బాగా ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను.
బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి.. అదితితో నా రిలేషన్ కారణంగా.. నాకు ప్రేమ మీదే విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం కలిగింది.. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు.. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’’ అన్నారు..
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?