Satyadev: భారీ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన సత్యదేవ్‌!

  • July 5, 2021 / 03:45 PM IST

ఆలస్యమైనా… పడ్డ కష్టం ఎప్పటికైనా గుర్తింపునిస్తుంది అంటారు. సినిమాల్లో అయితే కష్టపడితే వరుస అవకాశాలు వస్తాయి అంటారు. ఈ నానుడికి ఇటీవల ఉదాహరణగా నిలిచిన నటుడు సత్యదేవ్‌. మంచి పాత్ర దొరికితే చాలు… నన్ను నేను నిరూపించుకోవాలి అనుకుంటూ నటించాడు. ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. తాజాగా తన పెద్ద సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చాడు సత్యదేవ్‌. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్‌…

బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అవును… రీఎంట్రీనే. ఎందుకంటే అమితాబ్‌ బచ్చన్‌ ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ అనే సినిమా ద్వారా ఇప్పటికే సత్యదేవ్‌ బాలీవుడ్‌లో నటించాడు. అయితే అది చాలా చిన్న పాత్ర. ఇప్పుడు అక్షయ్‌ కుమార్ ‘రామ్‌ సేతు’లో అవకాశం సంపాదించాడు. ఈ విషయం చాలా రోజుల నుండి పుకారుగా ఉండగా… ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బాలీవుడ్‌ రీఎంట్రీ విషయాన్ని ఇటీవల సత్యదేవ్‌ ప్రకటించాడు. ‘రామ్‌ సేతు’లో భాగమైనందుకు ఆనందంగా ఉంది.

త్వరలో సెట్స్‌లో జాయిన్‌ అవుతాను ప్రకటించాడు. దీంతో సత్యదేవ్‌ కష్టం… ఫలితం బాలీవుడ్‌ భారీ సినిమా రూపంలో ఫలితంగా మారింది. మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌లోనూ సత్యదేవ్‌ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై ఆయన క్లారిటీగా చెప్పలేదు కానీ… ఆ సినిమాలో సత్యదేవ్‌ పక్కా అని చిరంజీవి కోటరీ చెబుతోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus