సత్యదేవ్ (Satya Dev) .. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి తర్వాత ‘జ్యోతి లక్ష్మీ’ (Jyothi Lakshmi) తో హీరోగా మారాడు. కానీ అది పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత విలక్షణ నటుడిగా మారి ‘క్షణం’ (Kshanam) ‘అప్పట్లో ఒకడుండేవాడు’ (Appatlo Okadundevadu) వంటి పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అటు తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’ (Bluff Master) సినిమాతో మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అది పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో, టీవీల్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వచ్చాడు. లాక్ డౌన్ టైంలో ఓటీటీలో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అది థియేటర్లలో రిలీజ్ అయితే సత్యదేవ్ కి ఒక కమర్షియల్ హిట్ పడుండేది. ఓటీటీ వల్ల కూడా అతనికి మేలే జరిగింది. హీరోగా వరుస సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ‘గాడ్ ఫాదర్'(God Father) సినిమాలో విలన్ గా కూడా చేసి మెప్పించాడు.
అప్పటి నుండి చిరుకి (Chiranjeevi) బాగా దగ్గరైపోయాడు. అందులోనూ అతను చిరంజీవికి వీరాభిమాని కావడం వల్ల.. ఆయనకు ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాడు అని చెప్పాలి. ఆ అనుబంధం వల్ల సత్యదేవ్ సినిమాకి కొంత మేలు జరిగింది అని చెప్పాలి. అదేంటంటే.. ‘గాడ్ ఫాదర్’ లో చిరంజీవికి విలన్ గా చేయడం వల్లే.. ‘జీబ్రా’ (Zebra) అనే పెద్ద బడ్జెట్ సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ సత్యదేవ్ కి (Satyadev) దక్కింది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు గెస్ట్ గా రావడం.. ఆ తర్వాత ఒక బోర్డు పై ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడంతో.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.5.5 కోట్లకి అమ్ముడయ్యాయట.అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘జీబ్రా’ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం.