టాలీవుడ్ కమెడియన్స్ లో ఒకరైన సత్యం రాజేష్ (Satyam Rajesh)… హీరోగా మారి ‘పొలిమేర'(ఓటీటీ) ‘పొలిమేర 2’ (Maa Oori Polimera 2) వంటి సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. అతను హీరోగా ఇప్పుడు ఇంకో సినిమా రూపొందింది. అదే ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా తేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ‘భార్యను హతమార్చిన భర్త కథ ఇది’ అని స్పష్టమవుతుంది. కొంచెం రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ‘మధ్యాహ్నం హత్య’ అనే సినిమా పోలికలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ముందుగా ‘టెనెంట్’ చిత్రాన్ని ఓటీటీ కోసం తెరకెక్కించారు మేకర్స్. నేరుగా ఓటీటీలో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.
అయితే సడన్ గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది టీం. ఈ మధ్య ఓటీటీ బిజినెస్ డౌన్ అయ్యింది. కోవిడ్ టైంలో మాదిరి మేకర్స్ అడిగినంత ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు రెడీగా లేవు. పెద్ద సినిమాలకు మాత్రమే బిజినెస్ అవుతుంది. అలాగే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే సినిమాలకి మేకర్స్ సరిగ్గా ప్రమోషన్స్ చేయడం లేదు అనే వాదన కూడా కొన్ని ఓటీటీ సంస్థల నుండి ఉంది.
అందుకే థియేట్రికల్ రిలీజ్ అయితే వాళ్ళు ప్రమోషన్ గట్టిగా చేస్తారు అని భావించి… ముందుగా థియేటర్లలో రిలీజ్ అవ్వాలనే కండిషన్ కూడా పెడుతున్నారు అని ఇన్సైడ్ టాక్. బహుశా టెనెంట్ విషయంలో కూడా ఇదే జరిగిందా లేక… ‘పొలిమేర 2 ‘ థియేటర్స్ లో మంచి సక్సెస్ అయ్యింది కాబట్టి ‘టెనెంట్’ ను కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.