ప్రభాస్ కి తగిన విలన్ కోసం వేట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తగిన విలన్ కోసం వెతుకుతున్నారు. ఏంటి రానాకు ఏమైంది ? అని అనుకుంటున్నారా.. అతనికి ఏమి కాలేదండీ బాబూ.. ప్రభాస్.. రానా ఇద్దరూ బాహుబలి – ది కంక్లూజన్ క్లైమాక్స్ ఫైట్ లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వెతికే విలన్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం. బాహుబలి సినిమాకు ముందు ఇచ్చిన  మాట ప్రకారం  ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ తోనే సినిమా చేయడానికి రెబల్ స్టార్ పచ్చ జెండా ఊపారు. బాహుబలి – ది కంక్లూజన్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రభాస్ రేంజ్ బాహుబలి తో అమాంతం పెరిగిపోయింది.

అంతటి గొప్ప మూవీ తర్వాత చేస్తున్న ప్రాజక్ట్ కావడంతో దీనిని కూడా భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి యు.వి.క్రియేషన్స్ వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రధాన తారాగణం ఉండాలని ప్రముఖ నటులను పరిశీలిస్తున్నారు. తమిళ హిట్ మూవీ కత్తి లో విలన్ గా చేసిన నీల్ నితిన్ ముఖేష్ ని సంప్రదించారు. ఈ బాలీవుడ్ నటుడు ప్రభాస్ తో తల పడేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

అంతేకాదు ప్రభాస్ పక్కన జోడీగా అమీ జాక్సన్ నటించేలా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె శంకర్ సినిమా రోబో2.0 సినిమాలో నటిస్తోంది. మొత్తానికి బాహుబలి – ది కంక్లూజన్ తర్వాత వచ్చే సినిమా కూడా ప్రభాస్ అభిమానులకు పండుగ తేనున్నట్లు ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus