Mahesh Babu, Trivikram: మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఈమేనా?

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే ఒక హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న నభా నటేష్ ఎంపికయ్యారని తెలుస్తోంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో రిజల్ట్ ను అందుకోలేదు.

అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ చెప్పిన మాస్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత నభా నటేష్ పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఇస్మార్ట్ శంకర్ సినిమా స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన మ్యాస్ట్రో ఈ నెల 17వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మహేష్ సినిమాలో నభా నటేష్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మహేష్ మూవీలో అవకాశం అంటే నభా నటేష్ కు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నటించి ఆ సినిమా సక్సెస్ సాధిస్తే నభాకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus