Balakrishna: ఆ హీరోయిన్ కు బాలయ్య అవకాశం ఇచ్చారా?

  • November 1, 2021 / 09:42 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుండగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమా కోసం ఏకంగా 2.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ రోల్ కోసం హీరోయిన్ భావన ఎంపికయ్యారని సమాచారం అందుతోంది. నటి భావన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో కనిపించనున్నారు.

భావన ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా నటిగా మెప్పించారు. చాలా కాలం తర్వాత భావన ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారని ఒక పాత్రలో బాలయ్య స్వామీజీ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని హీరో బాలకృష్ణ పాత్రలను పవర్ ఫుల్ గా చూపించనున్నారని తెలుస్తోంది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

దర్శకుల ఎంపికలో మారిన బాలకృష్ణ తన తరువాత సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. బాలయ్య నటించిన అఖండ డిసెంబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుండగా ఈ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని సమాచారం. అఖండలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus