పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్’గా అభిమానులకు వీనులవిందును ఇవ్వాలని, ఎంతో కష్టపడి, అన్నీ తనై, అంతా తానై నటించి, నిర్మించి తెరకెక్కించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. భారీ అంచనాలు, రికార్డుల ప్రభంజనానికి ఈ చిత్రం కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది అని భారీ ఆశలు, వెరసి పవన్ చరిష్మ, ఫాలోయింగ్ అన్నీ కలిపి సర్దార్ ను బ్లాక్ బస్టర్ గా నిలుపుతాయి అని అనుకున్న అభిమానులకు సర్దార్ రిసల్ట్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా ఫ్లాప్ కావడం మాత్రం పక్కన పెట్టి డిజాస్టర్ గా నిలవడానికి కారణం ఏంటి అని ఇప్పటికే సినీ సర్కిల్స్ లో, సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో చర్చ అనే రచ్చ మొదలయింది. అయితే తెలుగులోనే కాకుండా, హిందీలో సైతం ఈ సినిమాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంతటి ఘోర పరాజయాన్ని ఎందుకు మూటగట్టుకుంది ఆన్న వాదనకు పవన్ తాను మనసు విప్పి మాట్లాడిన ఒక టీవీ ఛానెల్ ఇంటెర్వ్యు లో ఈ సినిమా ఫేల్యూర్ సీక్రెట్ ను చెప్పేసాడు. అసలు ఈ సినిమా ఫ్లాప్ కు కారణం ఏంటి?? ఇంటర్‌వ్యూ లో పవన్ మాట్లాడుతూ…సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తాను కేవలం డబ్బుల కోసమే తీశానని, డబ్బు చాలా టైట్ గా ఉంది, అప్పులు ఎక్కువయ్యాయి అని, ఆ అప్పుల్లో నుంచి బయటపడాలంటే ముందు అర్జంటుగా ఓ సినిమా చేసేయ్యాలి అని, అందుకే వెంటనే, ఎలాంటి రిస్కూ చేయకుండా పక్కా ఫార్ములా సినిమా కోసం ప్రయత్నించి కమర్షియల్ సినిమానె చేశాను. అయితే అప్పట్లో ముందు గబ్బర్ సింగ్ కూడా ఇలాగే డబ్బు కోసమే చేశాను, అది హిట్ అయ్యింది, సర్దార్ ఫ్లాప్ అయ్యింది అంటూ పవన్ తన మనసులోని మాటని చెప్పేసాడు. పవన్ కు డబ్బు ఇబ్బందులు ఏమిటో వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది ఏది ఏమైనా…పవన్ కు మళ్ళీ పునర్‌వైభవం రావాలని మనస్పూర్తిగ కోరుకుంటున్నాం.