సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం అనేది బాలీవుడ్ గత కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఫాలో అవుతూనే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన (Manikarnika) “మణికర్ణిక” విడుదల తేదీని “ఏప్రిల్ 27, 2018” అంటూ ప్రకటించాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీలో తెరకెక్కుతున్నప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనుకొన్నారు.
కానీ.. సినిమాలో అనుకున్నదానికంటే ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి రావడం, రీషూట్స్ కూడా ఎక్కువవ్వడంతో విడుదల తేదీని వాయిదా వేయక తప్పలేదు. పోనీ, ఏప్రిల్ లో కాకపోయినా మే లేదా జూన్ లో సినిమా విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జూలై లేదా ఆగస్ట్ వరకూ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేలా లేదు. దాంతో.. “గౌతమీపుత్ర శాతకర్ణి” లాంటి చారిత్రక చిత్రాన్ని అతి తక్కువ కాలంలో తీసిన తాను ఈ సినిమా కోసం ఇన్నాళ్ళు టైమ్ వేస్ట్ చేయడం క్రిష్ కి నచ్చడం లేదట.