Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 14, 2026 / 04:59 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిరంజన్ సుధీంద్ర (Hero)
  • ఐశ్వర్య అర్జున్ (Heroine)
  • జగపతిబాబు, సత్యరాజ్, సిరి హనుమంతు, జయరాం తదితరులు (Cast)
  • అర్జున్ సర్జా (Director)
  • అర్జున్ సర్జా (Producer)
  • అనూప్ రూబెన్స్ (Music)
  • జి.బాలమురుగన్ (Cinematography)
  • అయూబ్ ఖాన్ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 14, 2026
  • శ్రీరామ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (Banner)

యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం “సీతా పయనం”. విశ్వక్ సేన్ హీరోగా మొదలైన ఈ చిత్రం అతను ఎగ్జిట్ అవ్వడంతో ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకుంది. ఎట్టకేలకి నేడు (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..!!

Seetha Payanam Movie Review

Seetha Payanam Movie Review and Rating

కథ: సీత (ఐశ్వర్య అర్జున్) చెఫ్ గా ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వడం కోసం వైజాగ్ నుండి హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలోనే అభిషేక్ (నిరంజన్) పరిచయమవుతాడు. ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపుల కారణంగా ఓ జీవిత సత్యం తెలుసుకుంటుంది సీత.

ఏమిటా విషయం? ఆ మలుపులు ఏమిటి? అభితో సీత ప్రయాణం ఏ తీరానికి చేరుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “సీతా పయనం” చిత్రం.

Seetha Payanam Movie Review and Rating

నటీనటుల పనితీరు: నటిగా కెరీర్ మొదలుపెట్టి దశాబ్దంపైనే అయినప్పటికీ.. కంటిన్యూస్ గా సినిమాలు చేయలేదు. అయితే.. ఈ సినిమాలో ఆమె లుక్స్ & ఎనర్జీ బాగున్నాయి. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మెచ్యూరిటీ ప్రదర్శించింది. అలాగే ఎమోషన్స్ ను పలికించిన విధానం కూడా బాగుంది.

కన్నడ నటుడు నిరంజన్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రెండు విభిన్నమైన షేడ్స్ ను చక్కగా ప్రెజెంట్ చేశాడు.

సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, సిరి హనుమంతులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ధృవ్ సర్జా యాక్షన్ బ్లాక్ బాగున్నప్పటికీ.. సరైన నేపథ్యం లేకపోవడంతో ఇరికించిన భావన కలుగుతుంది. కానీ.. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగుంది.

Seetha Payanam Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. తెలుగులో చాలా అరుదుగా వచ్చే రోడ్ మూవీ జానర్ లో మరీ కొత్తదనంవైపు వెళ్లకుండా.. కమర్షియల్ మీటర్ ఫాలో అవుతూనే, క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు బాలమురుగన్.

అనూప్ రూబెన్స్ సంగీతం సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కూడా ఎమోషన్స్ ను పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ మాత్రం ఏమాత్రం రాజీపడలేదు. అందువల్ల సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. ఎడిటింగ్ లో చాలా జర్క్స్ ఉన్నాయి, ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది.

దర్శకుడిగా, రచయితగా అర్జున్ సర్జా సత్తా ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితమే తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు ఆయన. “సీత పయనం” సినిమాలో దర్శకత్వ బాధ్యత కంటే, తండ్రిగా జాగ్రత్త ఎక్కువ తీసుకున్నాడు అర్జున్. అందువల్ల.. మరీ ఎక్కువ ఎలిమెంట్స్ ఇరికించేసాడు. సినిమా ద్వారా సమాజానికి అవసరమైన మెసేజ్ ఇవ్వడం మంచిదే కానీ.. మరీ ఎక్కువ మెసేజులు ఇచ్చేయడం కాస్త ఇబ్బందిపెడుతుంది. లైఫ్ జర్నీలో అన్నీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. ఏదైనా ఒక స్పెషల్ ఎమోషన్ ను కీలకాంశంగా ఎంచుకోవాల్సింది.

అది లోపించడంతో కథనంలో కనెక్టివిటీ మిస్ అయ్యింది. అయితే.. మానవీయ విలువల గురించి, బాంధవ్యాల గురించి మాత్రం హృద్యంగా చెప్పే ప్రయత్నం చేసారు. అలాగే.. మనం చేసే మంచి మనకి కచ్చితంగా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. ఓవరాల్ గా.. కాస్త వరుస మెసేజులతో ఇబ్బందిపెట్టినా.. సమాజానికి తనవంతు మంచిని, విలువలను గుర్తుచేసే ప్రయత్నాన్ని నిజాయితీగా చేశారు అర్జున్.

Seetha Payanam Movie Review and Rating

విశ్లేషణ: కమర్షియల్ టెంప్లేట్ లో అన్నీ సినిమాలు చూడలేం. కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కాస్త బోర్ కొట్టినా, అలాంటి సినిమాలు అప్పుడప్పుడూ రావడం అవసరం. అలాంటి ఓ మంచి ప్రయత్నమే “సీతా పయనం”. దర్శకుడిగా అర్జున్ నిజాయితీ, ఐశ్వర్య పెర్ఫార్మెన్స్ లో ఫ్రెష్ నెస్ & ఎనర్జీ, సినిమాలో డిస్కస్ చేసిన ఎలిమెంట్స్ కోసం కచ్చితంగా థియేటర్లో చూడొచ్చు.

Seetha Payanam Movie Review and Rating

ఫోకస్ పాయింట్: మానవీయ విలువలు గుర్తుచేసే ప్రయత్నం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Arjun
  • #Anup Rubens
  • #Arjun
  • #Niranjan
  • #Seetha Payanam Movie

Reviews

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 days ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version