Seetimaarr Movie: ఇలా అయితే.. ‘సీటీమార్’ కు గిట్టుబాటు అవుతుందా?

  • September 3, 2021 / 05:53 PM IST

గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో ‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ అనే మూవీ వచ్చింది. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మంచి హిట్టు కొట్టాలని కసితో ఈ చిత్రం చేశారు గోపీచంద్- సంపత్ నంది లు.హిప్పీ బ్యూటీ దిగంగన సూర్య వంశీ, భూమిక వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న గోపీచంద్ ఈసారి హిట్టు కొట్టడం ఖాయమని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్ వలన మేకింగ్ కాస్ట్ ఎక్కువైపోయిందట. మొదటి ఈ చిత్రాన్ని రూ.30 కోట్లలో ఫినిష్ చేయాలనుకున్నారు. కానీ అది రూ.40 కోట్లకు ఎగబాకింది. అయితే ఈ చిత్రానికి ఓటిటి ఆఫర్లు మంచిగానే వచ్చాయి. రూ.34 కోట్లు చెల్లిస్తామని ప్రఖ్యాత ఓటిటి సంస్థ ముందుకొచ్చింది. కానీ డిజిటల్ రిలీజ్ కు దర్శకనిర్మాతలు మక్కువ చూపలేదు. సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

అయితే ఈ సినిమాకి కేవలం రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగిందట.నాన్ థియేట్రికల్ రైట్స్ పూర్తిగా అమ్ముడు కాలేదని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా ఇదే అవుతుంది కానీ.. పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.సినిమాకి హిట్ టాక్ వస్తే నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడవుతాయి. లేదంటే కష్టమే. మరోపక్క థియేట్రికల్ రైట్స్ పరంగా.. రూ.16 కోట్లు ఈ టైములో కలెక్ట్ చేయాలి అన్నా కూడా కష్టమే. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 3 షోలే పడుతున్నాయి.వినాయక చవితి పండుగ టైంకి నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే పర్వాలేదు. లేదంటే బాక్సాఫీస్ వద్ద కూడా ‘సీటీమార్’ గట్టెక్కడం కష్టమే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus