Seetimaarr Trailer: మాస్ ఆడియెన్స్ కు ఫుల్ ఫీస్ట్ గ్యారెంటీ..!

గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది దర్శకత్వంలో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో ‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా దిగంగన సూర్య వంశీ, భూమిక వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో త‌రుణ్ అరోరా విలన్ గా నటిస్తున్నాడు.మణిశర్మ సంగీతంలో రూపొందిన ‘జ్వాలా రెడ్డి’ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే థీమ్ సాంగ్, ‘పెప్సీ ఆంటీ’ వంటి మాస్ సాంగ్ కూడా ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేసిందనే చెప్పాలి.ఇక సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ‘సీటీమార్’ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.హీరో రామ్.. ‘సీటీమార్’ ట్రైలర్ ను విడుదల చేశారు. ‘రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్.. అదే రూట్ లెవెల్ నుంచి అలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు’ అంటూ గోపీచంద్ పలికే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్లో కావాల్సినంత మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

‘మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోతున్నారు.. ఆడాళ్ళు కూడా 60 ఏళ్ళు బ్రతుకుతున్నారు. కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు’ అంటూ మహిళల గురించి హీరో గోపీచంద్ చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. తమన్నా రొమాంటిక్ త్రెడ్ అలాగే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రావు రమేష్ విలనిజం కలగలిపిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus