శేఖర్ కమ్ముల నెక్స్ట్ హీరో పవనా, మహేషా

స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా.. స్టార్ హీరోల జోలికిపోకుండా అందరూ కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తూ సూపర్ హిట్స్ సొంతం చేసుకొని స్టార్ డమ్ సంపాదించిన ఏకైక డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మధ్యలో “అనామిక” అనే ఒకే ఒక్క రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించి.. మొదటిసారి ఒక స్టార్ హీరోయిన్ నయనతారతో వర్క్ చేయడంతోపాటు ఆ సినిమా ఫ్లాపవ్వడంతోపాటు స్టార్లు వద్దనుకొని అప్పటికి వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న వరుణ్ తేజ్ తో “ఫిదా” అనే ఒక సాధారణ ప్రేమకథను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం మరోసారి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడని ఫిలిమ్ నగర్ టాక్.

అసలు విషయం ఏంటంటే.. “ఫిదా” స్క్రిప్ట్ ను తొలుత మహేష్ బాబుకు వినిపించాడట మన కమ్ముల సార్. అయితే.. హీరోయిజం ఎలివేషన్ లేకపోవడమే కాక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్ కావడంతో మహేష్ చేయనన్నాడట. కానీ.. సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి షాక్ అయిన మహేష్ తనకోసం మరో స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే.. దిల్ రాజు సూచనమేరకు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేశాడట శేఖర్ కమ్ముల. సో ఇద్దరు స్టార్ హీరోల కోసం స్క్రిప్త్స్ రెడీ చేయగా.. ముందుగా ఎవరికి ఏ కథ నచ్చుతుంది? ఎవరితో సినిమా మొదలవుతుంది? అనే ఆలోచనలో ఉన్నాడట శేఖర్ కమ్ముల. ఒకవేళ పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు లేట్ చేస్తే గనుక ఎలాగూ “హ్యాపీ డేస్” హిందీ రీమేక్ రెడీగా ఉంది కాబట్టి.. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఒకే చేసేలోపు ఆ హిందీ సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాడు శేఖర్ కమ్ముల. చూద్దాం మరి పవన్, మహేష్ లలో శేఖర్ కమ్ములకి ఒకే చెప్పేదెవరో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus