Sekhar Master: తారక్ స్పెషాలిటీ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

  • May 4, 2022 / 02:10 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్టీఆర్ డాన్స్ కు సాధారణ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్లలో భాగంగా మహేష్, తారక్ డాన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సులువుగా స్టెప్స్ వేస్తూ తక్కువగా కష్టపడే టాలీవుడ్ హీరో ఎవరనే ప్రశ్నకు తారక్ అని శేఖర్ మాస్టర్ సమాధానమిచ్చారు.

స్టార్ హీరోలు అయినా, డ్యాన్సర్లు అయినా తప్పనిసరిగా రిహార్సల్స్ చేస్తారని అయితే ఇండస్ట్రీలో అసలు రిహార్సల్స్ చేయకుండా డ్యాన్స్ చేసే హీరో మాత్రం తారక్ అని ఆయన చెప్పుకొచ్చారు. సెట్స్ కు వచ్చి అప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా స్టెప్స్ వేస్తాడంటూ తారక్ డ్యాన్స్ టాలెంట్ ను శేఖర్ మాస్టర్ బయటపెట్టారు. శేఖర్ మాస్టర్ తారక్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాటను బట్టి తాను స్టెప్స్ కంపోజ్ చేస్తానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

సర్కారు వారి పాట మూవీలో కళావతి, పెన్నీ పాటలతో పాటు మరో మాస్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా చేశానని త్వరలో రిలీజ్ కానున్న మాస్ సాంగ్ ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఉంటుందని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.మహేష్ బాబులో అద్భుతమైన రిథమ్ ఉంటుందని సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబు సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, రాజమౌళి సినిమాలకు పని చేయాలని ఉందని శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు.

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ కు రాబోయే రోజుల్లో వీళ్లిద్దరితో పని చేసే ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. ఆచార్య సినిమాలోని భలే భలే బంజారా సాంగ్ లో ఊపు లేదని అందుకే శేఖర్ మాస్టర్ స్టెప్పులు సైతం ఆకట్టుకోలేదని నెటిజన్లు చెబుతున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus