Actress Jayanthi: సినిమా పరిశ్రమలో మరో విషాదం ప్రముఖ నటి జయంతి మృతి!

  • July 26, 2021 / 10:53 AM IST

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జయంతి నేడు కన్నుమూశారు. 76 ఏళ్ల జయంతి గారు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక సోమవారం పరిస్థితి కాస్త విషమించడంతో ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీ ప్రముఖులను అలాగే అభిమానులను షాక్ కు గురి చేశాయి.

తెలుగు కన్నడ తమిళ సినిమా పరిశ్రమలో ఆమె ఎన్నో సినిమా చేశారు. దీంతో జయంతి మరణవార్తతో సౌత్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. జయంతి మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో చాలామందికి మంచి అనుబందం ఉంది. అలాంటి ఉత్తమ నటిని కోల్పోవడం హృదయాన్ని కలచివేస్తోందని ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి 1963లో ‘జెనుగూడు’ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరపై రంగప్రవేశం చేశారు.

భాషతో సంబంధ లేకుండా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించారు. అలనాటి అగ్ర నటులు నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆ తరువాత జనరేషన్ లో ఆమె కీలకపాత్రలు పోషించారు. ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయంతి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus