తెలుగు రాష్ట్రాల్లోని జనాలు అందరూ దీపావళి పండుగ హడావిడిలో ఉంటే.. ఊహించని విధంగా ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఈరోజు కన్నుమూశారు. ఈ వార్త ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను కుదిపేసింది అని చెప్పాలి. హైదరాబాద్ లో ఉన్న అపోలో హాస్పిటల్ లో ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సోమవారం నాడు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది. ఇక చంద్రమోహన్ పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల ఈయన స్వస్థలం. 1966 లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ‘సుఖదుఃఖాలు’, ‘పదహారేళ్ళ వయసు’, ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’ వంటి సినిమాలు ఈయనకి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన ఎంతోమంది హీరోయిన్లు ఈయన హీరోగా నటించిన సినిమాల ద్వారా పరిచయమయ్యారు. వారందరూ స్టార్స్ ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. అటు తర్వాత చంద్రమోహన్ సహాయ నటుడిగా, కమెడియన్ గా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక చంద్రమోహన్ మరణం పై టాలీవుడ్ ప్రముఖులు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఆయన మరణం టాలీవుడ్ కి తీరని లోటు అని వారు చెప్పుకొస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!