మండిపడుతున్న స్టార్ హీరోయిన్ & డైరెక్టర్

  • January 27, 2019 / 08:33 AM IST

ఆయనో సూపర్ సీనియర్ హీరో టర్నడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. 80ల కాలంలో కథానాయకుడిగా అలరించిన ఆయన 90ల నుంచే సహాయ పాత్రలు పోషించడం మొదలెట్టాడు. ఈమధ్యకాలంలో చాలా తక్కువ ఆఫర్లే వస్తున్నప్పటికీ.. తనకున్న పలుకుబడి కారణంగా నెట్టుకొచ్చేస్తున్నాడు. నటుడిగా అద్భుతమైన అభినయంతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల సత్తా ఉన్న ఆయన వ్యక్తిగా మాత్రం రోజురోజుకీ చెడ్డపేరు మూటగట్టుకుంటున్నాడు. షూటింగ్ స్పాట్ లో ఆయన వ్యవహార శైలి కానీ.. దర్శకుడి పనితనంలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఎవరైకీ నచ్చడం లేదు. అలాగని ఆయన మీద కంప్లైంట్ చేయలేక, ఆయన్ను సినిమా నుంచి తప్పించలేక చాలా ఇబ్బందులుపడుతున్నారు.

ఇక తాజాగా ఆయన చేసిన అతి కారణంగా సెట్స్ లో సభ్యులు చాలా పెద్ద షాక్ కు గురయ్యారట. షూటింగ్ కు తాగి రావడమే కాక.. స్పాట్ లో ఉన్న హీరోయిన్ కు ఏవో మెళకువలు చెబుతానంటూ ఆమె చేతులు వేసి చాలా అతి చేశాడట. డైరెక్టర్ చెప్పినా కూడా వినలేదట. దాంతో హీరోయిన్ పేకప్ చెప్పేసి వెళ్లిపోయిందట. మోస్ట్ సీనియర్ యాక్టర్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఎక్స్ పెక్ట్ చేయని సదరు డైరెక్టర్ కాస్త సీరియస్ అయ్యాడట. మరి ఇప్పటికైనా ఆ సీనియర్ మోస్ట్ యాక్టర్ తన తీరు మార్చుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus