అప్పట్లో మోహన్ బాబు, బాలయ్య.. ఇప్పుడు చిరు, రాజేంద్ర ప్రసాద్ తో సహా ఇంకా చాలా మంది!

‘నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది’.. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇది టాలీవుడ్ పెద్దలకి తెలియదంటారా? పెద్దలు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళ మాటలు యువతని ప్రేరేపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మంచిగా మాట్లాడితే.. మంచిని తీసుకుంటారు. లేదు అంటే ఇక తెలిసిందే. కుటుంబంలో పెద్దలు, ఊర్లో పెద్దలు కంటే టాలీవుడ్లో ఉన్న పెద్దలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. సినిమా జనాలని ఎక్కువ ప్రభావితం చేస్తుంటుంది. ఇక సినీ జనాలు ఏం మాట్లాడినా అటెన్షన్ తో వినే యువత చాలా ఎక్కువ.

Senior Actors

వీళ్ళ లైఫ్ స్టైల్ కనుక తేడాగా.. వీళ్ళకి తెలీకుండానే మిగిలిన వాళ్ళని చెడగొట్టినట్లు అవుతుంది అని చెప్పాలి. గతంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. మైక్, మీడియా అనే తేడా లేకుండా బూతులతో రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు రోడ్లపై జనాలను కొట్టిన సందర్భాలు కూడా అనేకం. అయితే గత రెండు, మూడేళ్ళ నుండి ఆయన బహిరంగంగా కోపం ప్రదర్శించడం అనేది చాలా తగ్గింది. ఇక డెడికేషన్, డిసిప్లిన్ అని చెప్పుకునే మోహన్ బాబు (Mohan Babu) సైతం పలుమార్లు మైక్ ముందు నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మీడియా వ్యక్తిపై మైక్ తో దాడి చేశారాయన.

దానికి గాను ఆయనపై కేసు కూడా నమోదైంది. గతంలో సీనియర్ నటుడు (Senior Actors) చలపతిరావు (Chalapathi Rao) కూడా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ (Rarandoi Veduka Chudham) అనే సినిమా వేడుకలో ‘ఆడవాళ్లు పక్కలోకి అయితే బాగా పనికొస్తారు’ అంటూ దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj)  .. ‘లైలా’ (Laila)  ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన రచ్చ కూడా అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి (Chiranjeevi) అయితే ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) సినిమా వేడుకలో ‘బ్రహ్మానందం (Brahmanandam) ఎర్రి మొహం వేసుకుని చూసేవాడు అనడం అలాగే తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ‘ఆయన రసికులు అంటూ ప్రస్తావించడం’ వంటివి కూడా ఆడియన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి.

ఇక మరో సీనియర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అయితే ‘ఒరేయ్ వార్నరు.. దొంగ ము*డా కొడుకు’ అంటూ తాగేసి ఇష్టమొచ్చినట్టు వాగారు. అలాగే ‘రాబిన్ హుడ్’ (Robinhood) ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు కార్ డోర్ ని కాలితో తన్ని తూలిపోతూ దర్శకుడు వెంకీ కుడుములని (Venky Kudumula) పట్టుకోవడం వంటి విజువల్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సీనియర్స్ (Senior Actors) ఇలా ప్రవర్తించడం వల్ల యువతని కూడా చెడగొట్టే అవకాశం ఉంటుందని.. కాబట్టి నలుగురిలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తే పద్ధతిగా ఉంటుంది అనేది అందరి మాటగా చెప్పుకోవాలి.

టోటల్ ఇండస్ట్రీకే షాక్.. రెండేళ్లలో ఒక్కటి కూడా ఓకే చేయలేదట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus