సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. 1989లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఓంప్రకాశ్ సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా వివిధ హోదాలలో పనిచేశారు. ఓం కథా రచయిత, మరియు కార్టూనిస్ట్ కూడా.
గత రెండున్నర దశాబ్దాలుగా జాగృతి వార పత్రికలో చిత్ర సమీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఎన్ టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో అసోసియేటెడ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఓంప్రకాశ్ చెప్పారు. తాను సి.బి.ఎఫ్.సి. అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ కావడానికి కారకులైన సంస్కారభారతి దక్షిణ మధ్య క్షేత్ర మాజీ సహ ప్రముఖ్ శ్రీ కుమారస్వామికి ఓంప్రకాశ్ కృతజ్ఞతలు తెలియచేశారు!!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!