సెప్టెంబర్ 25… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చీకటి రోజుగా మిగిలిపోయింది. గాన గంధర్వుడు, వెండితెరపై పలు పాత్రలకు ప్రాణం పోసిన నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని, తన దేహాన్ని విడిచి పరలోకాలకు పయనమయ్యారు. శాశ్వతంగా నిద్రలోకి చేరుకున్నారు. సరిగ్గా గతేడాది సెప్టెంబర్ 25న తెలుగు పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అదే రోజున కన్నుమూశారు. టైమ్ మెషిన్ కనుక ఉంటే సెప్టెంబర్ 25 మకు వెళ్ళి ఎస్పీ బాలు మరణాన్ని అడ్డుకుని ఆయనకు ప్రాణం పోసి వెనక్కి తీసుకు వచ్చేవాళ్ళమని అభిమానులు అంటున్నారు.
బాలు మరణ మీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. ఏడాది క్రిందట వేణుమాధవ్… ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం… సెప్టెంబర్ 25న ఇద్దరు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, ఆరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు వాళ్ళిద్దరినీ గుర్తుచేసుకుంటూ బాధలో మునిగిపోయారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!