Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత రెండు ప్లాపులు ఇచ్చాడు ప్రభాస్. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాలు బయ్యర్స్ కు భారీ నష్టాల్నే మిగిల్చాయి. అందులోనూ ఈ మూవీల్లో ప్రభాస్ నుండీ ఆశించే మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేవు. దీంతో ప్రభాస్ అభిమానులే కాకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా అప్సెట్ అయ్యారు. ఏ హీరో సినిమా అయినా ఆశించిన స్థాయిలో లేకపోతే తర్వాతి సినిమా సంతృప్తి పరుస్తుందిలే అని సరిపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభాస్ సెట్ చేసుకున్న లైనప్ అతని అభిమానులను ఏమాత్రం సంతృప్తి కరంగా లేదు.

Click Here To Watch NOW

ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ ‘ప్రాజెక్టు కె’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అటు తర్వాత ‘స్పిరిట్’ కూడా చేస్తున్నాడు. మారుతీతో సినిమా ఉందంటున్నారు కానీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. అయితే వీటిలో ఏది కూడా ప్రభాస్ అభిమానులను ఫుల్ గా సంతృప్తి పరిచే సినిమాలు కావు. పైగా ఇవి భారీ బడ్జెట్ సినిమాలు… బిజినెస్ ఎక్కువ చేస్తాయి కానీ జనాలను థియేటర్లకు రప్పించే సినిమాలు అవుతాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము.

ఇందులో ‘ఆదిపురుష్’ అనే సినిమా రామాయణంలోని మనకు తెలియని భాగంతో రూపొందుతోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చెప్పలేము. ఇలాంటి సినిమాలకి రిపీట్ ఆడియెన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు.2023 సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. పండుగ హాలిడేస్ వరకు బాగానే రాబడుతుంది. ఆ తర్వాత అయితే కష్టం. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందనుందనేది తాజా సమాచారం.

దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ కు కథ వినిపించడం.. ప్రభాస్ కు నచ్చడం కూడా జరిగిపోయిందట. ఇది కూడా సెట్స్ పైకి వెళ్తే.. ఇప్పట్లో ప్రభాస్ నుండీ అభిమానులు ఆశించే సినిమా రావడం కష్టమే..!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus