Suriya: పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సూర్య ఫస్ట్ మూవీ?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా రూట్లో సినిమాలు చేయాలని అడుగులు వేస్తున్నారు. ఒక్కసారి అలాంటి సినిమాకు కమిట్ అయ్యారంటే చాలు.. ఇక కంటిన్యూగా అదే తరహాలో పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్స్ లో సూర్య కూడా మొదటిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2016లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా 100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అసలైతే ఆ సినిమాను విక్రమ్ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. కానీ మహేష్ బాబు ఆ ప్రయోగాత్మకమైన సినిమా చేసేందుకు ధైర్యం చేయలేదు. ఇక విక్రమ్ ఆ తరువాత సూర్య కు చెప్పడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ దొరికింది. సూర్య కోసం మొదట అనుకున్న కథలో కొన్ని మార్పులు చేశారట. ఇక మొత్తంగా ఆ సినిమాలో సూర్య నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే దర్శకుడు విక్రమ్ ఆ కథకు సీక్వెల్ ను రూపొందించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. స్టోరీ లైన్ తో పాటు చాలా ఎపిసోడ్స్ రాసుకున్నాడట. ఇక స్క్రీన్ ప్లేను తెలివిగా మాలిచే విధానంలో దర్శకుడు ఇంకా కొంత వర్క్ ఫినిష్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్యతో థాంక్యూ అనే సినిమా చేస్తున్న విక్రమ్ కె కుమార్ ఆ ప్రాజెక్ట్ తరువాత 24 సినిమా సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో విడుదక చేసే విధంగా తెరపైకి తీసుకు వస్తాడట.

ఇక సూర్య కూడా మళ్ళీ ఎప్పటిలానే మూడు డిఫరెంట్ పాత్రలతో సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుందట. సూర్య కెరీర్ లోనే బిగ్గెసి మూవీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus