ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా 30 వచ్చేవరకు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. దీని వల్ల చాలా మందికి గర్భం దాల్చే అవకాశం తొందరగా రావడం లేదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని బాధపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఓ బుల్లితెర నటి కూడా ఫేస్ చేసిందట. అయితే ఇప్పుడు ఆమె గర్భం దాల్చినట్టు తెలియజేసింది. పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత అదీ 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది ఓ బుల్లితెర నటి.
వివరాల్లోకి వెళితే.. తమిళ బుల్లితెర నటి జూలీ అసిస్టెంట్ డైరెక్టర్ మణికందన్ ను 10 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు పిల్లలు కావాలి అని భావించారు. కానీ మొదటిసారి మిస్ క్యారీ అయ్యింది. దురదృష్టవశాత్తూ ఎందుకో రెండోసారి కూడా ఆమెకు అబార్షన్ అయ్యింది. రెండు సార్లు ఇలా జరగడంతో పిల్లల కోసం వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నారట. ఈ విషయాన్ని ఈ దంపతులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చారు.
ఎక్కడికి వెళ్లినా ‘పిల్లల ఉన్నారా?’ అని అడిగితే ‘చాలా బాధపడేవాళ్లమని’ వీళ్ళు చెప్పుకొచ్చారు. ‘అయితే దేవుడి దయ వల్ల జూలీ కడుపు పండింది’ అంటూ ఈ దంపతులు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు 5వ నెలలోనే జూలీ సీమంతం జరుపుకుంది. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా వీరు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.