Gangs of Godavari Teaser Review: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
- April 27, 2024 / 07:42 PM ISTByFilmy Focus
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందిన మరో వైవిధ్యమైన మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) . కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీకి కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకుడు. నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి (Anjali) కీలక పాత్ర పోషిస్తుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ‘సుట్టంలా..’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు.

1 :18 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్లో… యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ‘ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు .. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తికడుతున్నారంట్రా, వాడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది -ఇంక వాడిని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి’.. అంటూ కొంతమంది వాయిస్ ఓవర్లతో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత హీరో విశ్వక్ సేన్..

‘అమ్మోరు పూనేసిందిరా.. ఇక శివాలెత్తిపోద్ది’ అంటూ విశ్వక్ సేన్ తిరగబడటం మనం ఈ టీజర్లో చూడొచ్చు. ‘1960ల నాటి కథ ఇది. పుష్ప లాంటి క్యారెక్టరైజేషన్ హీరో విశ్వక్ సేన్ పాత్రది అని స్పష్టమవుతుంది. అయితే సొంత మనుషులు హీరోని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశం. టీజర్ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :












