బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతి రెడ్డి ఒకరు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతి రెడ్డి ఇప్పటికీ పలు సీరియల్స్ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి మాట్లాడుతూ తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి గారి మనవరాలినని తెలిపారు. ఇలా ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఇలా ఎంతోమంది డైరెక్టర్ల పిఏలు తమ ప్రాజెక్టులో నటించమని తన ఇంటి ముందు క్యూ కట్టే వారని ఈమె తెలియజేశారు.
ఇక తనకు చదవడం అంటే చాలా ఇష్టమని బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. ఇలా తనకు డిగ్రీ, ఎంఏ, ఎంఫీల్ వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయని తెలిపారు. అయితే మా ఇంటి ముందు డైరెక్టర్ల పిఏలు క్యూ కట్టడం చూసినటువంటి మా అమ్మ ఇంత పెద్ద వాళ్ళు నీకోసం వస్తే నువ్వు ఈ అవకాశాలను వదులుకుంటానంటావేంటి అంటూ తనని ఇండస్ట్రీ వైపు వెళ్లేలా తన తల్లి ప్రోత్సహించారని తెలిపారు.
ఇలా తన అమ్మ ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని జ్యోతి రెడ్డి తెలిపారు.ఇక తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తారని తనకు ఇద్దరు పిల్లలు కాగా వారి బాగోగులు అన్ని తన తల్లి చూసుకుంటున్నారని ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి వెల్లడించారు. ఇక తనకు తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ గౌరవం అని ఈమె తెలిపారు. అందుకే వారి ప్రేమకు గుర్తుగా వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నానని జ్యోతి రెడ్డి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?