ఒక్క రోజుకి ఈ టాప్ స్టార్స్, యాంకర్స్ ఎవరెంత తీసుకుంటున్నారంటే..?

సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే నటీమణులతో సమానంగా స్టార్ డమ్, స్టార్ స్టేటస్ తెచ్చుకుంటున్నారు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు.. సీరియల్స్, టీవీ షోలతో పాపులారిటీతో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.. తెలుగు టెలివిజన్ రంగాన్ని ఏలుతున్నారు.. ఒక్క రోజుకి టాప్ స్టార్స్, యాంకర్స్‌గా రాణిస్తున్న పది మంది ఎవరెంత తీసుకుంటున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) సుమ..

టీవీ ఫీల్డ్‌లో టాప్ యాంకర్ అంటే టక్కున చెప్పే పేరు సుమ.. సినిమాల్లోనూ అలరించిన ఈ స్టార్ యాంకర్.. షోలు, సినిమా ఫంక్షన్లు, సెలబ్రిటీ ఇంటర్వూల్లోనూ సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం తెలుగులో సుమను మించిన యాంకర్ ఎవరూ లేరు. స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే.. ప్రస్తుతం తెలుగులో సుమ కనకాలను మించిన స్టార్ యాంకర్ ఎవరు లేరు. సుమ లేని స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా ఊహించుకోవడం కష్టమే. ఆమె ఒక్క పూట చేసే ఒక్కో ఈవెంట్‌కి రూ. 3.5 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు అందుకుంటుందట.

2) అనసూయ భరద్వాజ్..

అనసూయ యాంకరింగ్‌తో పాటు అందానికి కూడా అభిమానులున్నారు. తన అందం చందాలతో అలరిస్తుంటుంది.. సినిమాల్లోనూ సత్తా చాటిన అనసూయ. ఒక్క ఈవెంట్‌కి రూ. 2 నుండి 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం..

3) రష్మీ గౌతమ్..

అనసూయ తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ.. తన గ్లామర్, ముద్దు ముద్దు మాటలతో మగజాతి మతిపోగొట్టే రష్మీ.. ఒక్కో షోకి.. అలాగే ఒక్క ఈవెంట్‌కి రూ. 2 నుండి 3 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది..

4) ప్రేమి విశ్వనాథ్..

వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమి విశ్వనాథ్ రోజుకి రూ. 25 వేలు పారితోషికంగా అందుకుంటుంది..

5) సుహాసిని..

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సీరియల్ ఆర్టిస్టుగా సెటిలైపోయింది తెలుగమ్మాయి సుహాసిని.. తను రోజుకి రూ. 20 వేలు తీసుకుంటుంది..

6) నవ్య స్వామి..

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందాల నటి నవ్య స్వామి పారితోషికం కూడా రోజుకి రూ. 20 వేలు..

7) పల్లవి రామిశెట్టి..

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పల్లవి రామిశెట్టి రెమ్యునరేషన్ రోజుకి రూ. 15 వేలు..

8) అషికా..

అషికా రోజుకి రూ. 12 వేలు తీసుకుంటుంది..

9) హరిత..

హీరోయిన్ రవళి సోదరి. నటుడు జాకీ భార్య, సినిమాలు, సీరియళ్లతో అలరిస్తున్న హరిత రోజుకి రూ. 12 వేలు అందుకుంటున్నారు..

10) సమీర..

తర్వాత స్థానంలో రోజుకి రూ. 10 వేలు తీసుకుంటున్న సమీర నిలిచింది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus