అప్పటివరకూ ఒకటి అరా సినిమాల్లో హీరోగా నటిస్తూ 20-40 లక్షల లోపు మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా అందుకొంటూ ఒకానొక పరిస్థితిలో ఫ్రీగా కూడా సినిమాలు చేసిన జగపతిబాబు కెరీర్ గ్రాఫ్ “లెజెండ్” సినిమాతో ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకూ ప్రతినాయక పాత్రల కోసం పరభాషా నటులను ఎక్స్ పోర్ట్ చేసుకోవడానికి అలవాటుపడిపోయిన దర్శకనిర్మాతలకు జగపతిబాబు అందుబాటులోకి వచ్చాడు. “లెజెండ్” చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతి బాబు.. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్నీ భాషాల సినిమాల్లోనూ నటిస్తూ మాయా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు 17 చిత్రాలు ఉన్నాయని సమాచారం.
గోపిచంద్ “ఆక్సిజన్”, కళ్యాణ్ రామ్-పూరి జగన్నాథ్ చిత్రాలు చిత్రాల్లో జగపతి బాబు నటిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్-గోపిచంద్ చిత్రంలోనూ, చిరు “కత్తిలాంటోడు” (వర్కింగ్ టైటిల్), బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రాల్లోనూ నటించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇవే కాకుండా పలు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ ఆయన నటించనున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న జగపతి బాబు..క్లిక్ సినీ కార్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఇటీవలే ప్రారంభించారు.