Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ కష్టం.. వాళ్లు ఆపుతారు అనుకుంటే.. వీళ్లు ఆపుతున్నారేంటి?

ఇండియన్‌ సినిమాలో స్టార్‌ ‘హీరో’యిన్‌ తాను మాత్రమే అనే రేంజిలో తనను తాను ఊహించుకునే కంగన రనౌత్‌కు (Kangana Ranaut) షాక్‌ తగిలింది. అయితే ఆమె, ఆమె ఇప్పుడు ఎంపీగా ఉన్న పార్టీ జనాలు ఊహించినవారి నుండి కాకుండా వేరే టీమ్‌ నుండి ఆమెకు నోటీసులు అందాయి. కంగన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) . ఈ సినిమా గురించి కంగనకు, నిర్మాణ సంస్థకు నోటీసులు వచ్చాయి. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ సినిమాను రూపొందించారు.

Kangana Ranaut

ఇందులో ఇందిరను నెగిటివ్‌గా చూపిస్తారు అని ఓవైపు విమర్శలు వస్తున్నాయి. ‘ఎమర్జెన్సీ’ అని పేరు పెట్టి ఇందిరలో ఒక యాంగిల్‌ను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నుండి అభ్యంతరాలు వస్తాయి అని అందరూ ఊహించారు. అయితే తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) తాజాగా ‘ఎమర్జెన్సీ’ సినిమా టీమ్‌కు అభ్యంతరాలు తెలిపింది.

ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్‌ నోటీసులు పంపింది. ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌ను అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ నుండి తొలగించాలని, ఆ ట్రైలర్‌ అభ్యంతరకరం అనేది శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వాదన. తమ కమ్యూనిటీకి సినిమా టీమ్‌ లిఖిత పూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాలి అని ఎస్‌జీపీసీ తమ నోటీసులో పేర్కొంది. మరోవైపు, ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ఎస్‌జీపీసీ ఇప్పటికే డిమాండ్‌ కూడా చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఇప్పటికే కంగన బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. జీ స్టూడియోస్‌తో కలసి కంగన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 6న విడుదల కానుంది. మరి విడుదల దగ్గరకొచ్చేసరికి ఇంకెన్ని వివాదాలు, సమస్యలు వస్తాయో చూడాలి.

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టుపై రియాక్ట్‌ అయిన సమంత.. ఏమందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus