సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో బిగ్ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లపై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది ఈ మూవీ. ఈ చిత్రానికి ఏకంగా రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు టీం చెప్పింది.
కానీ ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.30 కోట్లు మాత్రమే అయ్యిందని సమాచారం. ఇక ‘శాకుంతలం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బిజినెస్ అయితే జరగలేదు. చాలా చోట్ల దిల్ రాజు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మిగిలిన చోట్ల కొద్దిపాటి బిజినెస్ జరిగింది. మరి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.00 cr |
సీడెడ్ | 1.50 cr |
ఆంధ్ర | 5.00 cr |
ఏపీ+తెలంగాణ | 10.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.20 cr |
మిగిలిన భాషల్లో | 4.00 cr |
ఓవర్సీస్ | 1.80 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 17.50 cr |
‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17.5 కోట్లు అని తెలుస్తుంది. గుణశేఖర్ ఏమాత్రం ఫామ్లో లేని డైరెక్టర్.. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే అది సమంత, దిల్ రాజు ల క్రేజ్ పైనే ఆధారపడి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా ఎలా అయినా గట్టెక్కుతుంది. లేదంటే మాత్రం చేదు ఫలితం తప్పదనే చెప్పాలి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!