Shaakuntalam: శాకుంతలం చిత్ర యూనిట్ ఆశలపై నీళ్లు చెల్లిన తెలంగాణ గవర్నమెంట్!

శాకుంతలం.. భారీ బడ్జెట్‌తో, అందాల సమంత ప్రధాన పాత్రలో.. భారీ బడ్జెట్‌ చిత్రాల దర్శకుడు గుణ శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి రోజే ఊహించని షాక్‌ తగిలింది. షోలు రద్దయ్యాయి. ఆ వివరాలు..గుణశేఖర్‌ దర్శకత్వంలో.. సమంత ప్రాధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యకావ్యం.. శాకుంతలం. దేవ్‌ మోహన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మధుబాల, మోహన్‌బాబు, అనన్యనాగళ్ల వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. శుక్రవారం విడుదల అయ్యింది.

పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం రిలీజ్ చేశారు. అయితే శాకుంతలం (Shaakuntalam) చిత్ర యూనిట్ ఆశలపై నీళ్లు చెల్లిన తెలంగాణ గవర్నమెంట్! ఎందుకు అంటే..ఏప్రిల్‌ 14… భారత రాజ్యాంగ నిర్మాత.. డాక్టర్‌ బీఆర్‌ అబేద్కర్‌ జయంతి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంబేద్కర్‌ జయంతి రోజునే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

అంబేద్కర్‌ ముని మనవడి (ప్రకాశ్ అంబేద్కర్) తో కలిసి సీఎం కేసీఆర్‌ శుక్రవారం రోజున విగ్రహావిష్కరణ చేయనున్నారు. అయితే.. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ఎఫెక్ట్.. ఈరోజు రిలీజ్ అయిన సమంత ‘శాకుంతలం’పై పడింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.

సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల రోజున ఐమాక్స్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజున జరగనున్న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటం వల్ల పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాంతో ఐమాక్స్‌ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. విగ్రహ ఆవిష్కరణే కాకుండా..

ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అనుమతించట్లేదు. దీంతో థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో యాజమాన్య.. పలు షోలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus