ప్రభాస్ సత్తా చాటుతున్న”సాహో” మేకింగ్ వీడియో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. ఆ సీన్స్ చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ వీడియోని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ చాప్టర్ 1 వీడియోకు అనూహ్య స్పందన వస్తోంది. 24 గంటల్లోనే ఈ వీడియోకు 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. తెలుగు హీరోలలో మరే హీరో మూవీ మేకింగ్ వీడియోకు ఇంత మొత్తంలో వ్యూస్ వచ్చినట్లు చరిత్రలో లేదు. అంతేకాదు య్యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన మేకింగ్ వీడియోగా చరిత్ర సృష్టించింది.యూట్యూబ్‌లో సాహో మేకింగ్ వీడియోకు 4 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం జరిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో అతి ఎక్కువ మంది లైక్ చేసిన మేకింగ్ వీడియోగా సాహో ఓ ఘనతను సాధించింది. సోషల్ మీడియా ద్వారా సాహో మేకింగ్ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ లభించాయి. బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాక్రీ ష్రాఫ్, మందిరాబేడి, ఎవ్లీన్ శర్మ, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదతరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తుండగా, ఆర్ మధి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus