Shah Rukh Khan, Allu Ayaan: మొన్న అర్హ… ఇప్పుడు అయాన్‌… బాలీవుడ్‌ పాటలతో వైరలో వైరల్‌!

  • February 26, 2024 / 01:14 PM IST

సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ స్టార్‌ కిడ్స్‌ ఎవరు అంటే… అల్లు అర్జున్‌ కొడుకు, కూతురు అనే చెప్పాలి. మామూలుగానే వీర స్పీడులో ఉండే ఈ ఇద్దరూ ఇటీవల బాలీవుడ్‌ పాటలతో వైరల్‌ అవుతున్నారు. ‘యానిమల్‌’ సినిమాలోని ‘జమల్‌ కుడు’ పాటకు చిన్నగా నడుచుకుంటూ వచ్చి డ్యాన్స్‌ వేసి వైరల్‌ అయిపోయింది. ఆ వీడియో ఇంకా మైండ్‌లో రన్‌ అవుతుండగానే… అల్లు అయాన్‌ మరో వీడియలో వైరల్‌ లిస్ట్‌లోకి చేరిపోయాడు. ఈసారి షారుఖ్‌ ఖాన్‌ పాటతో.

అయాన్‌ వైరల్‌ అవ్వడమే కాదు… ఆ వీడియోకు (Shah Rukh Khan) షారుఖ్‌ ఖాన్‌ కూడా రిప్లై ఇచ్చాడు. అలా అని చెప్పి ఆ వీడియోను అల్లు అర్జున్‌, స్నేహ రెడ్డి కూడా షేర్‌ చేయలేదు. ఏదో ఫ్యాన్స్‌ పేజీ ట్వీట్ చేస్తే ఆ వీడియో వైరల్‌గా మారింది. దానికి షా రుఖ్‌ రిప్లై ఇచ్చాడు. ఓవైపు అయాన్‌ను మెచ్చుకుంటూనే మరోవైపు తన పిల్లలకు అల్లు అర్జున్‌ పాట పాడటం నేర్పిస్తా అని చెప్పాడు. ‘డంకీ’ సినిమాలోని ‘లుట్‌ పుట్‌ గయా…’ పాటను అల్లు అయాన్‌ పాడాడు. ఆ పాట వీడియోను ఎవరో ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అయాన్‌ ఇటీవల కారులో ప్రయాణిస్తూ సరదాగా ఆ పాట పాడాడు. ఆ వీడియో చూసి ‘నువ్వు ఫ్లవర్‌ అండ్‌ ఫైర్‌. ఇప్పుడు ‘శ్రీవల్లి’ పాటను మా పిల్లలతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నా’ అని షా రుఖ్‌ రాసుకొచ్చాడు. ఆ పోస్ట్‌పై అల్లు అర్జున్‌ లవ్‌ సింబల్‌ ఎమోజీ ఆనందం వ్యక్తం చేశాడు. ఓ అగ్ర హీరోకి మరో అగ్ర హీరో రిప్లై ఇవ్వడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టుల కింద కామెంట్స్‌ చూస్తే మీకు అర్థమైపోతుంది.

ఇక బన్నీ సంగతి చూస్తే ‘పుష్ప: ది రూల్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. షారుఖ్‌ ఖాన్‌ అయితే ఇంకా కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. గతేడాది ‘జవాన్‌’, ‘పఠాన్‌’, ‘డంకీ’ సినిమాలతో అలరించాడు.

https://twitter.com/SRKUniverse/status/1761332479590297791

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus