బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారని గత కొంత కాలం నుండీ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుహానా వయసు 18 ఏళ్ళు కావడంతో.. బాలీవుడ్ లో తనని ఘనంగా లాంచ్ చేయాలని షారుఖ్ అలాగే తన సతీమణి గౌరి ఖాన్ భావిస్తున్నారని వార్తలొచ్చాయి. మరోవైపు, ఇప్పటికే సుహానా సోషల్ మీడియా లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
సుహానా కి ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా… తాజాగా సుహానాకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ డేటింగ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో డేటింగ్ చేస్తారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సుహానా సమాధానమిస్తూ… ‘దక్షిణ కొరియా సింగర్, యాక్టర్ సుహోతో డేటింగ్ చేయాలనుకుంటున్నా’ అంటూ జవాబిచ్చింది. దీనితో పాటూ సుహో ఫొటోను కూడా షేర్ చేసింది. సుహో అసలు పేరు కిమ్ జున్ మియాన్. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.