దివంగత స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య సతీమణి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాతృమూర్తి, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, మెగాస్టార్ చిరంజీవి అత్తగారు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నాయనమ్మ అయినటువంటి శ్రీ అల్లు కనకరత్నం ఈరోజు మృతి చెందారు. ఆమె వయసు 94 ఏళ్ళు. కొన్నాళ్ళుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల.. శక్తి కోల్పోవడం, శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఆమెను వెంటాడాయి.
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం వేకువజామునే ఆమె నిద్రలోనే మరణించారు. కనకరత్నం పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి చేర్చడం జరిగింది. సాయంత్రం కోకాపేట్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కనకరత్నం పార్థివ దేహాన్ని సందర్శించేందుకు సినీ పరిశ్రమ నుండి చాలా మంది నటీనటులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లడం జరిగింది.
చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులు కూడా అల్లు అరవింద్ ఇంటి వద్ద అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న వీడియోలు వంటివి వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ తన నాయనమ్మ పాడె మోయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెనుక రామ్ చరణ్ సైతం తన అమ్మమ్మ పాడెను ఎత్తుకుని ఎమోషనల్ అవుతూ కనిపించాడు. ఇవి అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి.