కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కోటా శ్రీనివాసరావు వంటి లెజెండరీ నటుడు, కీరవాణి తండ్రి… టాప్ రైటర్ అయినటువంటి శివశక్తి దత్తా వంటి వారు మరణించడం జరిగింది. ఇంకా చాలా మంది చిన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, పక్క రాష్ట్రాల సినీ ప్రముఖులు కూడా మరణించారు. కొందరు అనారోగ్య సమస్యలతో, మరికొంతమంది వయోభారంతో.. ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకుని.. మరణించడం జరిగింది. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
అల్లు వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. దివంగత స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య సతీమణి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాతృమూర్తి, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అయినటువంటి శ్రీ అల్లు కనకరత్నం ఈరోజు మృతి చెందడం జరిగింది. ఆమె వయసు 94 ఏళ్ళు. కొన్నాళ్ళుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల.. శక్తి కోల్పోవడం, శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఆమెను వెంటాడాయట.
ఈరోజు ఉదయం వేకువజామునే ఆమె నిద్రలోనే మరణించినట్టు తెలుస్తుంది. కనకరత్నం పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి చేర్చడం జరిగింది. మధ్యాహ్నం కోకాపేట్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక అమ్మమ్మ పార్థీవ దేహాన్ని సందర్శించిన రామ్ చరణ్.. ఎమోషనల్ అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కనకరత్నం పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.