Dunki, Salaar: ప్రభాస్ కి గట్టి పోటీ ఇవ్వనున్న షారుక్.. బరిలో గెలిచేదెవరు?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో షారుఖ్ ఖాన్ చేస్తున్న మూవీ డంకీ. ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22 వ తేదీ విడుదల కాబోతుంది అనే విషయాన్ని ప్రకటించారు.

పఠాన్ , జవాన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి ఈ సినిమాలు తరువాత షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదల రోజు ప్రభాస్ హీరోగా నటిస్తున్న (Salaar) సలార్ సినిమా కూడా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

నిజానికి ప్రభాస్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండేది కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీకి వాయిదా పడింది దీంతో షారుక్ ఖాన్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఇక సలార్ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో షారుఖ్ ఖాన్ సినిమా వాయిదా పడుతుందని అందరూ భావించారు.

ఇలా షారుక్ ఖాన్ సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ మేకర్స్ ఏ విధంగానూ స్పందించలేదు అయితే తాజాగా ఈ సినిమా ప్రభాస్ సినిమా కంటే ముందుగానే విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కాగా షారుక్ ఖాన్ సినిమా డిసెంబర్ 21వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏది ఏమైనా మరోసారి ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ పోటీలో ఎవరు గెలుపొందుతారనే విషయంపై ఆత్రుత నెలకొంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus