Shahid Kapoor: కరీనా కపూర్‌ కిస్‌ క్లిక్స్‌పై ఇన్నాళ్లకు స్పందించిన స్టార్‌ హీరో.. ఏం చెప్పాడంటే?

సినిమా ఇండస్ట్రీలో వైరల్‌ ముద్దులు అంటే రానా – త్రిష, శింబు – నయనతార, షాహిద్‌ కపూర్‌ – కరీనా కపూర్‌ కాంబోలు గుర్తొస్తాయి. ఇవేవీ సినిమాల్లోవి కావనే విషయం మీకు తెలిసిందే. వాళ్ల ప్రైవేట్‌ స్పేస్‌ల జరిగినవి అవి. అయితే అవి ఎలా బయటకు వచ్చాయో తెలియదు కానీ బాగా వైరల్‌ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి ఉంటే ఇంకా వైరల్‌ అయ్యేవి అనుకోండి. అప్పుడెప్పుడో జరిగిన విషయాలు అవి. అయితే వీటిలో ఓ జంట ఫొటోల సంగతి ఇప్పుడు డిస్కషన్‌ పాయింట్ అన్నమాట.

కరీనా కపూర్‌ – షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) ముద్దు గురించే మేం చెప్పాబోయేది. మేం అంటే మేం కాదు.. షాహిద్‌ కపూరే ఆ విషయం గురించి మాట్లాడాడు. దీంతో ఆ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొన్నేళ్ల క్రితం షాహిద్‌ – కరీనా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లికి రెడీ అనుకుంటున్న సమయంలో వివిధ కారణాలతో విడిపోయారు. అయితే, ప్రేమలో ఉన్నప్పుడు వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్‌ అయ్యాయి. షాహిద్‌ – కరీనా ముద్దు పెట్టుకుంటూ ఆ ఫొటోలల్లో కనిపించారు.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు లీక్‌ కావడంపై 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు షాహిద్‌ కపూర్‌ తొలిసారి మాట్లాడాడు. ఆ ఫొటోలు లీక్‌ అయిన జరిగిన సమయంలో నా వయసు 24 ఏళ్లు. ముద్దు ఫొటోలు బయటకు రావడంతో ఎంతో బాధపడ్డాను. నా జీవితం నాశనం అయ్యింది అనిపించింది. నా ప్రైవసీకి అప్పుడు భంగం కలిగింది. ప్రైవసీని కాపాడుకోవడానికి ఏం చేయలేను అనిపించింది. దీంతో చాలా గందరగోళానికి గురయ్యా అని వివరించే ప్రయత్నం చేశాడు షాహిద్‌.

ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని, ఆ పరిస్థితులు బాధించాయని చెప్పాడు. తెలిసీ తెలియని వయసులో ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉండటం, ఆ వెంటనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడంతో చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇప్పుడు అంతా మారిపోయిందని, తనకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారని,. కాబట్టి తన పర్సనల్‌ లైఫ్‌పై ఎవరికీ అంత ఆసక్తి ఉండదు అని కౌంటర్‌ వేశాడు షాహిద్‌.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus