వైరల్ అవుతున్న పాయల్ వీడియో..!

  • December 26, 2018 / 07:56 AM IST

 ఇప్పుడు పాయల్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా రవితేజ హీరోగా వీ.ఐ.ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా పాయల్ ను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే . ఇదిలా ఉండగా పాయల్ తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జీరో’ చిత్రం పై తను చేసిన ఫన్నీ కామెంట్స్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తాజాగా విడుదలైన షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ ల ‘జీరో’ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం టేకింగ్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రం చూసాక పాయల్‌ రాజ్‌పుత్‌ కెమెరా ముందుకు వచ్చి ‘ఆఫ్టర్ వాచింగ్ జీరో’ అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగా… ఇప్పుడా వీడియొ చూసిన కొందరు పాయల్ పై మండిపడుతున్నారు. ఒక్క చిత్రం హిట్టయినంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఒకరు, ఈ వీడియో చూశాక మీ పై అభిమానం అంతా పోయిందని మరొకరు పాయల్‌ పై కామెంట్స్ చేసారు. అయితే ఈ విషయం పై పాయల్ స్పందించి వివరణ ఇచ్చింది. పాయల్ మాట్లాడుతూ… నేను షారుఖ్‌ నటన గురించి మాట్లాడలేదు.. కేవలం సినిమాలోని కథాకథనాల గురించి మాత్రమే చెప్పను..! నేను షారుఖ్‌కు పెద్ద ఫ్యాన్. ఫస్ట్‌ హాఫ్‌ సినిమా బాగుంది, సెకండాఫ్‌లో మాత్రం డ్రాగ్ ఎక్కువగా అనిపించింది…! అది చెప్పడం కొంచెం ఆలస్యమయింది…, కానీ ఇంతలోపే నా పై రావాల్సిన నెగెటివిటీ అంతా వచ్చేసింది…” అంటూ వివరణ ఇచ్చింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus