నిన్న ఉదయం నుంచి బాలీవుడ్ కింగ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు అనేది ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త. ఫ్రెండ్స్ తో క్రూజ్ పై రేవ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న షారుక్ కుమారుడు ఆర్యన్ తోపాటు పలువురు ప్రముఖుల కుమారులు కూడా పట్టుబడినప్పటికీ.. వారి పేర్లు మాత్రం బయటకి రాలేదు. మీడియా కూడా షారుక్ లాంటి పెద్ద పేరు ఉండడంతో మిగతావాళ్ళ డీటెయిల్స్ పై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. సందులో సడేమియా అన్నట్లు.. మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోయారు.
అయితే.. డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ప్రస్తుతానికి సేఫ్ అన్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కి నిర్వహించిన టెస్టుల్లో చాలా తక్కువ మోతాదు డ్రగ్స్ మాత్రమే తీసుకున్నట్లు తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా ఆర్యన్ కి డ్రగ్స్ మాఫియాతో సంబంధం లేదని కూడా రుజువైంది. డ్రగ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటాడే కానీ.. డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు లేవని స్పష్టమవ్వడంతో.. ఆర్యన్ కి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే.. ఎప్పట్లానే బాలీవుడ్ మీడియా ఓవర్ యాక్షన్ ను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు షారుక్.
అయితే.. తన కుమారుడు 22 సంవత్సరాల వయాసొచ్చాక డ్రగ్స్, శృంగారం, సిగరేట్స్ అన్నీ ఎంజాయ్ చేయమని నేనే ప్రోత్సహిస్తానని షారుక్ ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. తండ్రి మాటల్నే కుమారుడు సీరియస్ గా తీసుకునున్నాడని జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే.. బాలీవుడ్ కి డ్రగ్స్ అనేది కొత్త కాదు కాబట్టి ఈ విషయాన్ని జనాలు సీరియస్ గా తీసుకోరు. అందుకే షారుక్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు.