Shalini Pandey: అలాంటి రోల్ లో నటించాలన్నదే నా డ్రీమ్‌:షాలిని పాండే

ఎప్పుడూ న్యూలుక్‌లో.. మోడర్న్‌గాళ్‌గా ఉండటం ఇష్టం. ఇన్‌స్టాలో, ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాలకంటే నన్ను నేను ప్రొజెక్ట్‌ చేసుకుంటా. నా నిజ జీవితం కనపడుతుంది. 20 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోయర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వస్తాను.. ఇంత ఫేమ్‌ సాధిస్తానని అనుకోలేదని అంటోంది షాలిని పాండే. ప్రేక్షకులకు షాలిని పాండే అంటే తెలియదేమో.. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో ప్రీతి అంటే బాగా గుర్తుంటుంది. ఇన్‌స్టాలో రెండు మిలియన్ల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది.

ఈ అమ్మడు కి అర్జున్‌రెడ్డి’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత ‘బేబీ’ .. ‘ప్రీతి’ అంటూ ఎన్నో మెసేజ్‌లు ప్రతిరోజూ వచ్చాయని చెప్పింది. ప్రీతి పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ క్రేజ్‌తో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘మహానటి’, ‘ఎన్టీయార్‌ కథానాయకుడు’, ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’.. ఇన్ని చిత్రాలు తెలుగులో చేసినా ఇంకా.. ‘ప్రీతి’గా నన్ను గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అంటే ఆ పాత్ర తీరు.. ఆ సినిమా క్రేజ్‌ అలాంటిది.

తమిళంలో కూడా మూడు చిత్రాల్లో నటించా. గతేడాది రన్‌వీర్‌ సింగ్‌తో కలసి హిందీలో ‘జయేష్‌భాయ్‌ సర్దార్‌’ చిత్రంలో నటించా. ప్రస్తుతం ‘మహారాజా’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నా చెప్పింది. ఈరోజు ఇలా ఉన్నానంటే.. సినిమా మీద ఉండే ప్రేమ. సక్సెస్‌ వచ్చినా.. కథానాయిక అయినా సాధారణంగా ఉంటా. కమల్‌హాసన్‌, అమితాబ్‌ గారి సినిమాల్లో ఐదు నిముషాలు కనపడినా చాలు అనుకుంటా.

అంతలా వారి నటనను ఇష్టపడతా. మిరాకిల్స్‌ జరగవు.. అనుకునేదాన్ని. అర్జున్‌రెడ్డి సినిమాతో జీవితంలో ఓ మిరాకిల్‌ జరిగింది. నాకు డ్రీమ్ అంటే నెగటివ్‌రోల్‌లో నటించాలన్నదే నా డ్రీమ్‌. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తరహా పాత్ర (నెగిటివ్ రోల్) చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ (Shalini Pandey) షాలిని పాండే చెప్పింది

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus