సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కి దాదాపు 12 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అతనికి డీసెంట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. దానిమీద ఆధారపడే అతను వరుస సినిమల్లో నటిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో అతన్ని పరాజయాలు వెంటాడాయి. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘శంబాల'(Shambhala) పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కచ్చితంగా ఈసారి ఆది హిట్టు కొడతాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చాయి. అందుకే ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ‘శంబాల’ ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది.
ఎప్పుడైతే ‘శంబాల’ థియేట్రికల్ హక్కులు ఆ సంస్థ టేకప్ చేసిందో..బిజినెస్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 0.75 cr |
| సీడెడ్ | 0.35 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.90 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.0 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
| ఓవర్సీస్ | 0.10 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 2.2 కోట్లు(షేర్) |
‘శంబాల’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన ఏరియాల్లో మేకర్స్ పర్సెంటేజీ పద్దతిలో రిలీజ్ చేసుకున్నారు. సో మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ తో డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడు లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని అవకాశం ఉంటుంది.